వరకట్నం వద్దన్న జితేంద్రుడు

వరకట్నం వద్దన్న జితేంద్రుడు

జైపూర్ : రూ.లక్షల వర కట్నాన్ని నిరాకరించి సంప్రదాయానుసారం కేవలం రూ. 11 కట్నంగా తీసుకొని ఆదర్శంగా నిలిచాడు రాజస్తాన్కు చెందిన జితేంద్ర సింగ్ కుమార్. జితేంద్ర సింగ్ కుమార్ సీఐఎస్ఎఫ్లో ఉద్యోగి. ఈ నెల 8న ఆయన వివాహం జైపూర్లో ఘనంగా జరిగింది. వధువు తండ్రి కట్నంగా రూ.11 లక్షలు ఒక పళ్లెంలో తెచ్చి జితేంద్ర సింగ్కు ఇవ్వబోతుంటే అతను తన రెండు చేతులు జోడించి కట్నం వద్దని తెలిపారు. సంప్రదాయ ప్రకారం రూ. 11తో పాటు ఒక టెంకాయను మాత్రమే స్వీక రించా రు.’నాకు అర్ధాంగిగా రానున్న వ్యక్తి రాజస్తాన్ జ్యుడీషిల్ సర్వీస్కు ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఆమె పరీక్షలో నెగ్గితే మా కుటుంబానికి అంతకు మించిన ఆనందం ఏముంటుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు. కుటుంబ సంతోషమే గౌరవమని’ జితేం ద్ర సింగ్ పేర్కొన్నారు. దీంతో వధువు తండ్రి ముఖం కన్నీళ్లతో నిండిపోయింది. అక్కడున్నవారిని భావోద్వేగానికి గురి చేసింది. ‘ మొదట్లో అతను డబ్బు వద్దన్నప్పుడు నేను కంగారు పడ్డాను.వరుని కుటుంబసభ్యులు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సరి గా లేవని అనుకున్నారేమోనని భావించా. కానీ వారి కుటుంబం వర కట్నానికి వ్యతిరేకత అని తెలుసుకొని చాలా సంతోషించా’ అని వధువు తండ్రి ఆనందంగా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos