ఎన్‌పిఆర్‌పై శాసనసభలో తీర్మానం

ఎన్‌పిఆర్‌పై శాసనసభలో తీర్మానం

అమరావతి: జాతీయ జనాభా పట్టిక (ఎన్పిఆర్)ను 2010 తరహాలోనే నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఎన్ఆర్సికి ఎన్పిఆర్ ప్రక్రియ తొలి దశ. ‘ఎన్పిఆర్ ప్రక్రియలోని కొన్ని ప్రశ్నలు మా రాష్ట్రంలోని మైనార్టీలలో అభద్రతకు కారణమయ్యాయి. దీనిపై మా పార్టీలో విస్తృతంగా చర్చించాం. 2010 తరహాలోనే తాజా ఎన్పిఆర్ ప్రశ్నలూ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చే శాసనసభ సమావేశాల్లోనూ తీర్మానిస్తామ’ని ట్వీట్ చేసారు. ఎన్ఆర్సిని వ్యతిరేకిస్తామని గతంలోనే జగన్మోహన్రెడ్డి ప్రకటించినా ఎన్పిఆర్ నిర్వహణ సన్నాహాలు జరుగు తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువు. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ, పశ్చిమ బంగ, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఎన్పిఆర్ను అమలు చేయ బోమని ఇప్పటికే శాసనసభల్లో తీర్మానించాయి. 2010 తరహాలో ఎన్పిఆర్ను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ బీహారు శాసన సభ తీర్మానించింది.జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే బాటలో పోదలచారు. పౌరసత్వ హక్కులకు పెనుసవాల్గా మారిన ఎన్ఆర్సి, సిఎఎలకు దారితీసే ఎన్పిఆర్నుఅడ్డు కోవడానికి కేరళ ప్రభుత్వం శాసనభలో తీర్మానం చేయడంతో పాటు ఎన్పిఆర్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. సిఎఎకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ తరహా చర్యలే ప్రజానీకంలోని భయాందోళనల్ని తొలగిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos