రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు..

  • In Film
  • November 20, 2019
  • 135 Views
రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు..

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియోపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల సురేశ్ ప్రొడక్షన్స్ నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ ఐటీ వింగ్ అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. గడచిన నాలుగేళ్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ చూపుతున్న లెక్కల్లో తేడాలు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు, తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేష్ బాబుతో అనుబంధం ఉన్న ఇతర సంస్థల కార్యాలయాలతో పాటు పలువురు హీరోలు.. దర్శకులు.. నిర్మాతల ఇళ్లపైనా ఐటీ దాడులు కొన సాగుతున్నట్టు సమాచారం. ఇక ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టి లో ఐటీ సరిగా చెల్లించని పలువురు స్టార్ హీరోలు.. నిర్మాతల పేర్లు ఉన్నాయని తాజాగా సమాచారం

తాజా సమాచారం

Latest Posts

Featured Videos