ఐఎస్‌ఎల్‌లో చిరు సందడి..

ఐఎస్‌ఎల్‌లో చిరు సందడి..

క్రికెట్ మాత్రమే క్రీడగా భావించే భారత్లో ఫుట్‌బాల్‌ క్రీడకు సైతం క్రేజ్ తీసుకొచ్చి యువతకు ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో 2013లో ప్రారంభించిన ఇండియన్ సాకర్ లీగ్(ఐఎస్ఎల్) ఆరో సీజన్ అట్టహాసంగా మొదలైంది.ఈ నేపథ్యంలో ఐఎస్ఎల్ లీగ్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఐఎస్ఎల్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకల్లో సందడి చేశారు.కొచ్చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవంలో చిరంజీవి సందడి చేశారు.ఈ నేపథ్యంలో ఐఎస్ఎల్ ప్రారంభోత్సవానికి హాజరైన చిరును చూడగానే స్టేడియం హోరెత్తిపోయింది.చిరంజీవి కూడా ఎంతో సంతోషంగా అభిమానులకు అభివాదం చేశారు.కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు,అట్టటికో కోల్కత జట్టు సహయజమాని సౌరవ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు. ఆరంభ మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అట్లెటికో ది కోల్కతాపై విజయం సాధించింది.

తాజా సమాచారం