రికార్డు సృష్టించనున్న విజయ్‌ దేవరకొండ లిప్‌లాక్‌..

  • In Film
  • May 14, 2019
  • 149 Views
రికార్డు సృష్టించనున్న విజయ్‌ దేవరకొండ లిప్‌లాక్‌..

అర్జున్‌రెడ్డి చిత్రంతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ అదే చిత్రంతో మరో గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు.అర్జున్‌రెడ్డి చిత్రం అనంతరం విడుదలైన ప్రతీ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉంటుండడంతో దక్షిణాది ఇమ్రాన్‌ హష్మీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీతగోవిందం, నోటా,టాక్సీవాలా సినిమాల్లో హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించిన విజయ్‌ త్వరలో విడుదల కానున్న డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో రష్మిక మందన్నతో మరోసారి నటించిన లిప్‌లాక్‌ సన్నివేశం చిత్రానికే హైలైట్‌ కానున్నట్లు సమాచారం.విజయ్‌తో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించన కారణంగా రష్మిక మందన్న ఎన్ని ఇబ్బందులు,విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో హీరోయిన్‌ విజయ్‌తో లిప్‌లాక్‌కు సై అన్నట్లు వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.డియర్‌ కామ్రేడ్‌ దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న విజయ్‌ అదే చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించనున్న రాశిఖన్నాతో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించనున్నట్లు తెలుస్తోంది.విజయ్‌కున్న గుర్తింపు,క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు క్రాంతి లిప్‌లాక్‌ సన్నివేశం సుదీర్ఘంగా ఉండేలా డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది.దక్షిణాదిలో ఇప్పటి వరకు ఏచిత్రంలో లేని విధంగా సుదీర్ఘమైన లిప్‌లాక్‌ సన్నివేశం ఈ చిత్రంలో ఉండనుందని ఈ సన్నివేశం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం.కథ డిమాండ్‌ మేరకు విజయ్‌,రాశిఖన్నా లిప్‌లాక్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos