ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి

ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి

జెరూసలాం : ఇజ్రాయెల్, ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్ఫోర్స్ బేస్ల పై దాడి చేసింది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు ఆ దాడిని తిప్పికొట్టాయని వా ర్తా సంస్థలు ప్రకటించాయి. ఈ కథనాలను ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. గత శనివారం ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos