భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్‌

భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్‌

న్యూ ఢిల్లీ : ఇరాన్ మంగళవారం భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది. వీసా నిబంధనలను ఈ నెల 4 నుంచి ఎత్తి వేసినట్లు తెలిపింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపింది. భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని తెలిపింది. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీ వర్తిస్తుందని, ఆరు నెలల కోసారి మాత్రమే ఈ మాదిరి టూర్లకు అనుమతిస్తామని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos