పెట్టుబడులు రాకుండా కుట్రలు

పెట్టుబడులు రాకుండా  కుట్రలు

అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా, తెరాస, భాజపా కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర  యువత ఉపాధికి గండి కొట్టేందుకే ప్రయత్ని స్తున్నాయని దుయ్యబట్టారు.కానీ వారి ఆటలు తన వద్ద సాగవని హెచ్చరించారు.  గత పది రోజుల్లో  రాష్ట్రానికి 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ట, కోసం తాను కష్ట పడుతుంటే, అప్రదిష్ట తెచ్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఉదయం  ఇక్కడ నుంచి ఆయన తెదేపా నాయకులు, ప్రతినిధులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.  వైకాపా  అధ్యక్షుడు కేసీఆర్‌ కాగా  వైకాపా, తెరాసలకు సంయుక్త కార్యాధ్యక్షుడు కేటీఆర్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ తెరాస చేతిలో కీలు బొమ్మగా  మారారని మండి పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌ పై ద్వేషంతో కేసీఆర్‌ కుటుంబం ఉందనేందుకు  ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే రుజువన్నారు. తెలుగు తల్లిని అవమా నించిన కేసీఆర్‌తో జగన్‌కు స్నేహం ఎందుకని  ప్రశ్నించారు. కేసీఆర్‌ పెట్టుబడి పెడితే జగన్ కప్పం కడతారని నిప్పులు చెరిగారు.  తెరాస వద్ద గుట్టలు గుట్టలుగా ధనం మూలుగుతున్న ధనాన్ని  వైకాపాకి అందిస్తున్నారని ఆరోపించారు. తెదేపా అభ్యర్థులను బెదిరించే భాజపా నీచ కుట్రలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే ఎన్నికల్లో గుణపాఠాన్ని చెబుతారన్నారు. తెదేపా సమాచారం చోరీపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం  ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తుందని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos