31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులుండవు

31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులుండవు

ఢిల్లీ : కరోనా ఉధృతి వల్ల అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఇండియా నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్గో, ముందుగా అనుమతి పొందిన విమానాలను కొన్ని రూట్లలో మాత్రమే రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించింది. గత నెల 26వ తేదీన జులై 15 వరకూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలను నిషేధిస్తున్నట్లు డీజీసీఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు మే 6 నుంచి వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియాతో సహా పలు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. మే 25 నుంచి దేశీయ విమానయాన సర్వీసులను నడిపేందుకు డీజీసీఏ అనుమతిచ్చింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos