ఐఎన్‌ఎస్‌ కవరట్టి జల ప్రవేశం

ఐఎన్‌ఎస్‌ కవరట్టి జల ప్రవేశం

విశాఖపట్టణం : జలంతర్గాముల్ని తుత్తునియులు చేసే యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి గురువారం ఇక్కడి నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది.పదాతి దళాధిపతి ఎంఎం నరవణే దీన్ని లాంఛనంగా ఆరంభించారు. ప్రాజెక్ట్ 28-కమోర్టా క్లాస్ లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకల్లో ఇది చివరిది. డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్, కోల్కతా గార్డెన్ రీసర్చ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంయక్తంగా దీన్ని నిర్మించారు. ‘ ఇది పెరుగుతున్న భారత నౌకదళం, జీఆర్ఎస్ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాక దేశీయంగా తయారు చేయడంతో భారత్ స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ని ఉద్ఘాటిస్తుంద’ని అధికారులు అన్నారు. కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి చర్యల్ని తీసుకునే సెన్సార్ సూట్ ఉంది. 90 శాతం దేశీయంగా తయారయ్యింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos