ధోనీకి గాయం…తొలి వన్డేకు అనుమానమే…

ధోనీకి గాయం…తొలి వన్డేకు అనుమానమే…

హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హైదరాబాద్‌లో శనివారం ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి వన్డేలో ఆడడం అనుమానాస్పదంగా మారింది. శుక్రవారం నెట్స్‌ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని ముంజేతికి గాయమైంది. జట్టు సహాయక సిబ్బంది రాఘవేంద్ర వేగంగా విసిరిన బంతి కుడి చేతికి బలంగా తగిలిగింది. దీంతో ధోనీ ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయలేదు. శనివారం మ్యాచ్ సమయానికి ధోనీ కోలుకుంటాడా లేదా అనేది ఈ రాత్రికి గానీ తేలేట్లు లేదు. ఒక వేళ ధోనీ ఆడలేకపోతే రిషభ్ పంత్ వికెట్ కీపర్ బాధ్యతలు చేపడతాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos