కుప్ప కూలిన ఇన్ఫోసిస్‌ షేర్లు

కుప్ప కూలిన ఇన్ఫోసిస్‌ షేర్లు

బెంగళూరు: ఇన్ఫోసిస్ ప్రధాన అధికారులకు వ్యతిరేకంగా వచ్చిన అవినీతా ఆరోపణలు ఆ సంస్థ షేర్ల విలువను ప్రభావితం చేసింది. మంగళ వారం స్టాక్ మార్కెట్లలో అవి కుప్పకూలాయి. ఒక్కో షేరు ధర ఒక దశలో 16 శాతానికి పైగా పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో 10శాతం నష్టంతో మొద లైన షేరు ధర ఒక దశలో 15.94శాతం విలువ కోల్పోయింది ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఉదయం 10.30 గంటల వేళకు బీఎస్ఈలో ఇన్ఫీ షేరు ధర 13.38శాతం నష్టంతో రూ. 665.15 వద్ద, ఎన్ఎస్ఈలో 13.41శాతం నష్టంతో రూ. 664.85 వద్ద ట్రేడ్ అయ్యింది. న్యూయా ర్క్ స్టాక్ మార్కెట్లలోనూ ఇన్ఫీ షేరు భారీగా పతనమయ్యాయి. సోమవారం షేరు విలువ 10 నెలల కనిష్ఠానికి పడింది. అమెరికన్ డిపాజి టరీ రిసీట్స్ కూడా 12 శాతానికి పైగా విలువ కోల్పోయాయి. 2013 తర్వాత ఈ రిసీట్స్ ఇంత భారీగా పడిపోవడం ఇదే తొలిసారి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos