నావికాదళం సంచలన నిర్ణయం..

నావికాదళం సంచలన నిర్ణయం..

నావికాదళం సిబ్బంది సామాజిక మాధ్యమాలు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ భారత నావికాదళం కీలక నిర్ణయం తీసుకుంది.శత్రుదేశం పన్నిన హనీట్రాప్‌ వలలో చిక్కుకొని రక్షణ,భద్రత సమాచారాన్ని శత్రుదేశం పాకిస్థాన్‌కు చేరవేస్తూ ఏడు మంది నావికాదళం సిబ్బందిని అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో నావికాదళం ఈ నిర్ణయం తీసుకుంది.భారత నౌకాదళానికి చెందిన బోర్డు నౌకలు, వైమానిక స్థావరాల్లో సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లను కూడా అనుమంచమని ఓ ప్రకటనలో భారత నైకాదళం పేర్కొంది.ఇందులో ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్కూడా ఉన్నారు.కాగా భారత నౌకాదళం కూడా ఫేస్బుక్‌, ట్విట్టర్ఖాతాలను ఉపమోగిస్తుంది. కానీ.. వాటిలో నౌకాదళం సాధించిన విజయాలు, విపత్తుల సమయంలో అందించిన మానవ సహాయం, సంబంధిత విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్లకు చెందిన ప్రకటనలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos