భారతీయుడు 2 విడుదల తేదీ ఫిక్స్..

  • In Film
  • August 8, 2019
  • 71 Views
భారతీయుడు 2 విడుదల తేదీ ఫిక్స్..

దర్శకుడు శంకర్‌-కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో 1996వ సంవత్సరంలో విడుదలైన భారతీయుడు ఎంతటి సంచలనమో అందరికీ తెలిసిందే. దాదాపు 23 ఏళ్ల అనంతరం భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా కొద్ది రోజుల క్రితం భారతీయుడు 2 చిత్రీకరణ మొదలుపెట్టిన విషయం కూడా తెలిసిందే.అయితే చిత్రీకరణ మొదలుపెట్టిన రోజు నుంచి తరచూ అవాంతరాలు ఎదరువుతుండడంతో భారతీయుడు 2పై అనుమానాలు నెలకొన్నాయి.పలు రకాల కారణాలతో చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తుండడంతో ఇకపై ఎటువంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ చేయడానికి నిర్ణయించుకున్న శంకర్‌ విడుదల తేదీని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.2021 మార్చ్ 14 ఎలాగైనా సినిమాను విడుదల చేయాలనీ నిర్మాతల వద్ద అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట. వచ్చే ఏడాది నవంబర్‌కు చిత్రీకరణ పూర్తి చేసి అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్‌,గ్రాఫిక్స్‌ పనులు పూర్తి చేసి ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చ్‌14న చిత్రం విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos