సజావుగా పోలింగ్‌..

సజావుగా పోలింగ్‌..

నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకోవడానికి నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లకు ఓటర్లు ఉదయం నుంచి భారీగా చేరుకుంటున్నారు.మొత్తం 302 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 15 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది. నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి.దీంతో పోలింగ్‌ను నిలిపివేసి… అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు.ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటింగ్ సరళిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.ఉపఎన్నిక కావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు చింతకుంట్లలోని పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ గుర్తులు గుర్తించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను..పోలింగ్ తీరును పరిశీలించారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు.మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos