ప్రవాస భారతీయులను చూసి నేర్చుకోండి..

ప్రవాస భారతీయులను చూసి నేర్చుకోండి..

మాతృదేశం రుణం తీర్చుకునే విషయంలో విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు ఇతర ప్రవాసీ భారతీయులను చూసి నేర్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు.ఇస్లామాబాద్‌లో అవినీతి వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్, చైనా దేశాలకు చెందిన ప్రవాసులు తమ సొంత దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, వారి స్ఫూర్తితో పాకిస్థానీలు కూడా తమ మాతృదేశాన్ని అభివృద్ధి చేసేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.వేళ్లూనుకున్న అవినీతి కారణంగా పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు.యువత విద్యావకాశాలపైనా,ఉన్నత విద్య, పరిశోధన రంగాలపైనా ఖర్చు చేయాల్సిన ధనం, సముద్ర తీరాల్లో విలాసవంతమైన భవనాల నిర్మాణానికి, బ్యాంకు అకౌంట్లను మరింత నింపడానికి తరలిపోతోందని ఇమ్రాన్ ఆరోపించారు.”విదేశాల్లో ఉన్న భారతీయులు, చైనీయులు తమ తమ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలు దూసుకుపోతున్నాయి. విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను మనకున్న గొప్ప ఆస్తిగా భావిస్తున్నాం. కానీ వారు దేశంలోని అవినీతి, లంచగొండితనం చూసి పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారుఅంటూ వ్యాఖ్యానించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos