మోడీ పాలనను విస్మరించిన ఐఎల్‌ఓ

మోడీ పాలనను విస్మరించిన ఐఎల్‌ఓ

న్యూఢిల్లీ:ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా మెరుగుపరిచామని కేంద్రంలోను, రాష్ట్రంలోను పాలకులు అదే పనిగా చేస్తున్న ప్రచారం ఒట్టి బూటకమని మరోసారి స్పష్టమైంది. భారత్లో ఉపాధి పరిస్థితి భయంకరంగా ఉందని, నిరుద్యోగిత రేటు, కీలక లేబర్ సూచీలు 2000-2018 మధ్య ఉపాధిలో దీర్ఘకాలిక క్షీణతను సూచిస్తున్నాయని, నిరుద్యోగ సైన్యంలో 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ (ఐహెచ్డీ) తాజాగా వెల్లడించాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా ఎంప్లారుమెంట్ రిపోర్ట్ 2024’ను ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ మంగళవారం నాడిక్కడ విడుదల చేశారు. ”దేశంలో నిరుద్యోగ సమస్య యువతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులలో ఎక్కువగా ఉంది”అని తెలిపారు. నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువకులు 2000లో 35.2 శాతం మంది ఉండగా, 2022లో ఇది 65.7 శాతానికి అంటే రెండింతలు పెరిగినట్టు ఆ నివేదిక పేర్కొంది. అలాగే చదువుకున్న నిరుద్యోగుల్లో పురుషుల (62.2 శాతం) కంటే స్త్రీలు (76.7 శాతం) ఎక్కువగా ఉన్నారని తెలిపింది. దేశంలోని పట్టణ ప్రాంత యువ విద్యావంతులలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా కేంద్రీకృతమైందని ఈ నివేదిక పేర్కొంది. 2019లో ఉపాధిలో కొంచెం పెరుగుదల కనిపించినా, కోవిడ్ మహమ్మారి సమయంలో మళ్లీ క్షీణించిందని నివేదిక తెలిపింది. 2000లో మొత్తం ఉపాధి యువత జనాభాలో సగం మంది స్వయం ఉపాధి పొందారు. 13 శాతం మంది రెగ్యులర్ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. మిగిలిన 37 శాతం మంది కాజ్యువల్ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. మరోవైపు మరో దశాబ్దంలో దేశంలో యువ శ్రామిక శక్తి 7-8 మిలియన్లు (70-80 లక్షలు) చేరుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదు కీలక విధాన రంగాలపై దృష్టి సారించాలని సూచించింది. ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం, ఉపాధి నాణ్యతను మెరుగుపరచడం, కార్మిక మార్కెట్లో అసమానతలను పరిష్కరించడం, క్రియాశీల కార్మిక మార్కెట్తోపాటు లేబర్ మార్కెట్ నైపుణ్యాలు, విధానాలు బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. నాగేశ్వరన్ మాట్లాడుతూ, ‘ప్రతి సామాజిక, ఆర్థిక సమస్యకు’ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని భావించడం ‘సరి కాదు’ అని అన్నారు. ”మనం ఈ ఆలోచన నుండి బయటపడాలని సుద్దులు చెప్పారు. ప్రధాన ఆర్థిక సలహాదారు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నివేదిక నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి తిరుగులేని తార్కాణమని పేర్కొన్నాయి. యువత భవిష్యత్తును మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. నిరుద్యోగ టైం బాంబ్పై యువత కూర్చొన్నదని ఆయన అన్నారు.. నిరుద్యోగం వంటి అన్ని సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు చెబుతూ తమ ప్రియమైన నాయకుడ్ని రక్షిస్తున్నార ఆయన విమర్శించారు. 2012తో పోల్చితే మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత శాతం మూడు రెట్లు పెరిగిందన్నారు. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని, అయితే యువత నుంచి 12 కోట్ల ఉద్యోగాలు లాక్కున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిరుద్యగ సమస్య పరిష్కారం కోసం ‘యువ న్యారు’ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఖర్గే తెలిపారు.సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పందిస్తూ ఉపాధి విషయంలో దేశంలోని యువకులు అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారనడానికి ఐఎల్ఓ నివేదిక ఒక తిరుగులేని ఉదాహరణ అని అన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos