ఆదిత్యనాథ్‌ కు ఎదురు దెబ్బ

ఆదిత్యనాథ్‌ కు ఎదురు దెబ్బ

లక్నో: ఆదిత్యనాథ్ సర్కార్కు ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల పేర్లు, వివరాలతో కూడిన హోర్డింగ్లను జిల్లా అధికారులు ఇక్కడి కూడళ్లలో అమర్చినందుకు న్యాయస్థానం మండి పడింది. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది. న్యాయవాది శశాంక్ త్రిపాఠి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యంపై న్యాయమూర్తులు గోవింద్ మాతుర్, రమేష్ సిన్హాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఆదేశాలిచ్చింది. జిల్లా యంత్రాంగం చర్య వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా ఉందని వ్యాఖ్యానించింది. వెంటనే హోర్డింగులు తొలగించి ఆ విషయాన్ని తెలపాలని ఆదేశించింది. సీఏఏ నిరసనల్లో హింసాకాండ చెలరేగడంతో అల్లర్లకు పాల్పడిన వల్ల జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దరిమిలా సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో హింసాకాండ పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న పలువురు వ్యక్తుల ఫోటోలు, పేర్లు, చిరునామాలతో కూడిన హోర్డింగ్లను లక్నో జిల్లా యంత్రాగం నగరంలోని కూడళ్లలో ఏర్పాటు చేసింది. వీటి వల్ల సంబంధితులపై మూక దాడులు జరిగే అవకాశాలు న్నాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos