జనసేనకు మద్దతుగా హైపర్‌ ఆది,గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌ ప్రచారాలు….

జనసేనకు మద్దతుగా హైపర్‌ ఆది,గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌ ప్రచారాలు….

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హైపర్‌ ఆది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా తన అభిమాన నటుడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారాల్లో దిగారు.శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగనున్న నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా హైపర్‌ ఆది ప్రచారాలు నిర్వహించారు.నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో టీ గ్లాసు గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెన్షన్‌ ప్రకటించిన నేత కేవలం పవన్‌కళ్యాణ్‌ మాత్రమేనన్నారు.

ఇతర పార్టీల సభలు,సమావేశాలకు పార్టీల కార్యకర్తలతో పాటు డబ్బులు,మద్యం,బిర్యానీ కోసం ఆశపడే వ్యక్తులు వస్తారని కానీ పవన్‌కళ్యాణ్‌ సభలకు ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారడానికి ఇదే నిదర్శనమన్నారు.జనసేన తరపున మొట్టమొదట గెలిచే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ కావాలనే ఉద్దేశంతో తెనాలి నుంచి ప్రచారాలు ప్రారంభించానన్నారు.మరోవైపు గబ్బర్‌సింగ్‌ సినిమాతో గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌ గుర్తింపు తెచ్చుకున్న నటులు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలుసుకొని పార్టీకి మద్దతుగా ప్రచారాలు ప్రారంభించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos