మహాసముద్రం హీరోయిన్ అదితి రావు హైదరీ

మహాసముద్రం హీరోయిన్ అదితి రావు హైదరీ

హైదరాబాదు: శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం-‘మహాసముద్రం లో హీరోయిన్ గా అదితి రావు హైదరీని ఎంపిక చేసినట్లు నిర్మాణ బృందం తెలిపింది. ప్రేమ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. సినిమా కథ వైజాగ్ ఇతివృత్తంగా నడుస్తుందని సమాచారం. గాలిని మోసుకొచ్చే అలలా అదితిరావు హైదరీ మా టీమ్ లో జాయినవుతోంది… ఆమెకు స్వాగతం అంటూ పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos