తెలంగాణకు కేంద్ర బృందం రాక

తెలంగాణకు కేంద్ర బృందం రాక

హైదరాబాదు: తెలంగాణ వరద పరిస్థితులపై పరిశీలన, అంచనా కోసం తెలంగాణకు కేంద్ర బృందాన్ని పంపుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు. హైదరాబాద్ నగరంపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుగా కుండపోత వర్షాలు కురిశాయి. నగరంలో వరదలు పోటెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా ప్రాణ నష్టం జరిగింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తుంది. రేపు, ఎల్లుండి జరిగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర బృందం అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆస్తినష్టం, ప్రాణనష్టం వివరాలపై ఓ అంచనాకు వస్తారని వివరించారు. వరదల్లో మృతి చెందినవారికి రూ.4 లక్షలు ఇవ్వాలని కేంద్రం గతంలోనే చట్టం చేసింది. కేంద్ర సాయం అందేలోపు ఎస్టీఆర్ఎఫ్ నిధుల నుంచి ఖర్చు చేయాలని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ వరద బాధితుల కోసం తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos