ఆండ్రాయిడ్‌కు దీటుగా హాంగ్‌మెంగ్

ఆండ్రాయిడ్‌కు దీటుగా హాంగ్‌మెంగ్

బీజింగ్: అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా చైనా మొబైల్‌ తయారీ దిగ్గజం హువావే సొంత ఆపరేటింగ్ సిస్టమ్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని’ హెచ్చరించిన హువావే ఆండ్రాయిడ్కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్‌మెంగ్’ ఓ ఎస్ ను వినియోగదారులకు అందించి అమెరికా సాంకేతిక దిగ్గజాలు గూగుల్‌, ఆపిల్ను దెబ్బతీయదలుస్తోంది. హాంగ్‌మెంగ్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని సంస్థ సమాచార విభాగం ఉపాధ్యక్షుడు ఆండ్రూ విలియమ్సన్ తెలిపారు. చైనాలో మిలియన్‌కు పైగా స్మార్ట్‌ఫోన్లలో దీన్ని బిగించా మన్నారు. త్వరలోనే ట్రేడ్‌మార్క్ సాధించనున్నాన్నారు. గత నెలలో అమెరికా హువావేను వ్యాపార లావాదేవీలను నిషేధించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్వర్కుకు ప్రమాదం పొంచి ఉన్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికా కంపెనీ లైన గూగుల్‌, ఆపిల్‌ కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ మార్కెట్‌ను ఏలుతున్న సంగతి తెలిసిందే. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos