‘కౌగిలింత’ ఆమె ఉద్యోగం.. ఆదాయం రూ.28 లక్షలు!

‘కౌగిలింత’ ఆమె ఉద్యోగం.. ఆదాయం రూ.28 లక్షలు!

బాధ లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నపుడు ఎవరినైనా గట్టిగా హత్తుకుని మనసు భారాన్ని దించేసుకోవాలనే ఫీలింగ్ చాలామందిలో కలుగుతోంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. దీంతో కొందరు ఒంటరిగానే కుంగిపోతారు. అలాంటి వ్యక్తులకు నేనున్నా.. అంటూ చేతులు చాపుతోంది.. రాబిన్ స్టినె. అమెరికాలోని కన్సార్‌కు చెందిన రాబిన్ స్టినె కౌగిలించుకోడాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంది. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు. కేవలం కౌగిలింతలే కాదు, ఆమె తన శరీరమంతటినీ కస్టమర్లకు అప్పగిస్తానని రాబిన్ స్టినె తెలిపింది. చేతుల్లో చేతులు పెట్టవచ్చని, తన శరీరాన్ని నిమరుతూ రిలాక్స్ కావచ్చని పేర్కొంది. తాను కూడా వారి శరీరాన్ని సున్నితంగా నిమురుతూ వారి ఒత్తిడి దూరం చేసేందుకు సహకరిస్తానని తెలిపింది. ఇది కేవలం థెరపీ మాత్రమేనని, సెక్స్‌కు ఆస్కారం లేదని పేర్కొంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos