గుమ్మడి పంటకు ఆర్థిక మాంద్యం దెబ్బ

హొసూరు : ఈ ప్రాంతంలో పండించిన గుమ్మడి పంటకు సరైన ధరలు లభించకపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలివేస్తున్నారు. హొసూరు ప్రాంత రైతులు టమోటో, క్యాబేజీ, బీన్స్, బంగాళా దుంపలు తదితర పంటలను పండించి తమిళనాడులోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. దసరా పండుగను పురస్కరించుకుని గుమ్మడి కాయలను దిష్టి తీయడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందులో భాగంగా రైతులు ఈ ఏడాది కూడా గుమ్మడి పంటను ఎక్కువగా సాగు చేశారు. పంట బాగా పండి నూర్పిడి దశలో పరిశ్రమలు మూతపడ్డాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆయుధ పూజలు చేసే వారు బాగా తగ్గిపోయారు. ఇది రైతుల పాలిట శాపంగా మారింది. దసరా పండుగకు గుమ్మడి కాయలు భారీగా అమ్ముడు పోకపోవడంతో రైతులు నిరాశ చెందారు. సరైన ధర లభించకపోవడంతో పాటు అమ్మకాలు తగ్గిపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలివేశారు. ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని హొసూరు ప్రాంతంలోని గుమ్మడి రైతులు ఆవేదన వక్తం చేశారు.

తాజా సమాచారం