పార్కింగ్ కేంద్రంగా హొసూరు బస్టాండు

హొసూరు : స్థానిక బస్టాండు ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ప్లేస్‌గా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హొసూరు మీదుగా బెంగళూరుకు ప్రయాణిస్తుంటారు. ఇక్కడి నుంచి బెంగళూరుకు నిత్యం కార్మికులు, విద్యార్థులు వెళుతుంటారు. రోజూ ప్రయాణికులతో రద్దీగా ఉండే హొసూరు బస్టాండులో ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలను నిలపడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండులో వాహనాలను నిలిపే వారిపై చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. బస్టాండు సమీపంలోనే ద్విచక్ర వాహనాలను నిలపడానికి అనువైన స్థలం ఉన్నా, ద్విచక్ర వాహనదారులు బస్టాండులోనే తమ

బండ్లను పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ బెడదను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos