అక్కడ ఖనిజం తవ్వరాదు

అక్కడ ఖనిజం తవ్వరాదు

బళ్లారి: కర్ణాటక-ఆంధ్ర సరిహద్దుల్లో 2 కి.మీ. పరిధిలో గనుల తవ్వకాలపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవిస్తామని సామాజిక కార్యకర్త, సమాజ పరివర్తన సముదాయం వ్యవస్థాపకుడు ఎస్.ఆర్.హీరేమఠ్ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులకు సంబంధించి ఇప్పటికీ వివాదం కొనసాగుతోం దన్నారు. ఇనుప ఖనిజం పేరిట గతంలో సరిహద్దు రాళ్లను కొందరు తారుమారు చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో సహా ఇతరులు తమ భూ భాగం లో ఇనుప ఖనిజాన్ని తవ్వుకునేందుకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం దీనిని ఆమోదిస్తే మరోసారి అక్కడ అక్రమంగా ఇనుప ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని, మైనింగ్ మాఫియాను అడ్డుకునేందుకు మరో పోరాటానికి సమాయత్తమవు తున్నామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos