అసోం సీఎం హిమంతపై కేసు న‌మోదు

అసోం సీఎం హిమంతపై కేసు న‌మోదు

హైదరాబాద్; కాం గ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ పార్టీ నేతల పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీని అవమానించారనే ఆరోపణల కింద కేసులను చేర్చామని పోలీసులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు బదిలీ అవుతాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్లో జీడీ ఎంట్రీ చేసుకున్నారని, వాటిని జూబ్లీహిల్స్ పీఎస్కు బదిలీ చేస్తారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒకే విషయంపై అనేక ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos