నైతిక విలువల్ని సమాజమే బోధించాలి

నైతిక విలువల్ని సమాజమే బోధించాలి

న్యూఢిల్లీ : కోర్టులు ప్రజలకు నైతిక విలువలు బోధించలేవని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నైవ్యంగ చిత్రకారుడు బాలమురుగన్పై నమోదైన క్రిమినల్ పరువు నష్టం వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్ధించింది. 2017 లో వేసిన కార్టూన్ లో తమిళనాడు సీనియర్ ప్రభుత్వ సిబ్బందిని అభ్యంతరకరమైన రీతిలో చూపారనేది ఆరోపణ. ‘భిన్నమైన వ్యక్తులు భిన్నమైన రీతుల్లో కార్టూన్లు వేస్తారు. ప్రజాస్వామ్య దేశంలో భావాలకు, వ్యక్తీకరణకు, మాట్లాడేందుకు స్వేచ్ఛ వుంటుంది. ప్రజాస్వామ్యానికి ఇవే పునాదులు. ఇవి లేనిదే ప్రజా స్వామ్యం మనలేదు. మానవ సమాజ పరిణామం జరగదని’ న్యాయమూర్తి జి.ఇళంగోవన్ పేర్కొన్నారు. కోర్టులు ప్రజలకు నైతిక విలువలు బోధించలేవన్నారు. దాన్ని సమాజమే చేయాలన్నారు. తిరునల్వేలి జిల్లాలోని దిన కూలి కుటుంబం ఆత్మాహుతికి పాల్పడిన ఘటన పట్ల ప్రభుత్వ ఉదాసీనతను నిరసనగా బాలమురుగన్ కార్టూను వేశారు. అది సామాజికమాధ్యమాల్లో సంచలనమైంది. దానిపై జిల్లా కలెక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని బాలమురుగన్ కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos