ఏనుగుల స్వైర విహారం

ఏనుగుల స్వైర విహారం

హోసూరు: హోసూరు పరిసరాల్లో  నిరాటంకంగా సాగుతున్న  ఏనుగుల సంచారం వల్ల స్థానికులు భయ భ్రాంతులకు లోనవు తున్నారు. పట్టణ శివార్లలోని బన్నేరుఘట్ట అడవుల నుంచి 100 ఏనుగుల మంద నెల రోజుల కిందట సానమావు అడవుల్లో తిష్ట వేసాయి.  వీటిలో ముప్పయి ఏనుగులు నొగనూరు, డెంకణి కోట అడవులు ద్వారా  హోసూరు ప్రాంతానికి చేరాయి. డెంకణి కోట అడవుల్లో మరో 50 ఏనుగులు ఉడే దుర్గం అడవుల శివారు   గ్రామాల రైతులు సాగు చేసిన రాగి పంటను నాశనం చేశాయి. శని వారం ఉదయం ఉదయం లింగనాం పట్టి గ్రామానికి  సుమారు 50 ఏనుగులు రావడంతో స్థానికులు భయ బ్రాంతులకు లోనయ్యారు. ఏనుగుల సంచారం వల్ల కోతకు వచ్చిన రాగిపంటను కోయలేక ఇబ్బందులు పడుతు న్నామని రైతులు తెలిపారు. రాత్రిలో 3 ఎకరాలకు పైగా రాగి పంటను తినేస్తాయని రైతులు వాపోయారు. ఏనుగులను వెంటనే కర్ణాటక రాష్ట్రానికి తరిమెందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని హోసూరు ప్రాంత రైతులు డిమాండ్ చేసారు. నుగుల మందకు చేరువగా వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదం అని గ్రామ ప్రజల్నిఅటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos