తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు

తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు

జగిత్యాల: ‘బీజేపీ రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసు. ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీలు, ఐటీలతో విపక్షాలపై దాడులు చేయించడం సహజమేన’ని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘బీజేపీ వదిలే బాణాలు, పెట్టించే పార్టీలు కూడా ఉంటాయి. బీహార్, యూపీలాంటి రాష్ట్రాల్లో అయితే బీజేపీ బాణాలు, పార్టీలు, కుట్రలు నడుస్తాయి. ఉద్యమాల గడ్డ తెలంగాణలో అవి నడవవు’అని వ్యాఖ్యానించారు. ఈ నెల 7న నగరంలో జరిగనున్న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. యన వెంట ఎమ్మెల్సి కవిత కూడా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos