నేను రష్మికలా చేయలేదు..

  • In Film
  • October 11, 2019
  • 424 Views
నేను రష్మికలా చేయలేదు..

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న పెదవిముద్దు సన్నివేశంపై బహుభాష నటి హరిప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హరిప్రియ కన్నడలో నటించిన కొత్త చిత్రంలో హీరో సృజన్ లోకేశ్‌తో అధర చుంబనం సన్నివేశంలో నటించారు.అయితే ఈ దృశ్యాన్ని రష్మిక మందన్న,విజయ్ దేవరకొండ జంటగా నటించిన గీతగోవిందం చిత్రంలోని లిప్‌లాక్‌ సీన్‌తో పోల్చి చూస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో చిత్రం ప్రచారాల్లో పాల్గొన్న హరిప్రియ వీటిపై స్పందించారు. ‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య అధర చుంబనం జరిగిందని..తాను నటించిన ‘ఎల్లిదే ఇల్లితనకా’ సినిమాలో తమ మధ్య మామూలు ముద్దు సన్నివేశం జరిగిందని హరిప్రియ తెలిపారు. తన అభిమానులు,కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూసేలా తను నటించాలని భావిస్తున్నట్లు.. అది తన బాధ్యత అని చెప్పింది. కథ డిమాండ్ చేసింది కాబట్టే ముద్దు సీన్ లో నటించానని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos