తెదేపాను భాజపలో విలీనం చేస్తారా బాబూ

తెదేపాను భాజపలో విలీనం చేస్తారా బాబూ

విజయవాడ : చంద్రబాబు నాయుడుకు తెదేపాను భాజపాలో విలీనం చేయదలిస్తే తాను దీని గురించి అధిష్ఠానంతో మాట్లాడతానని భాజపా అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది నాయ కులు వస్తే తమ పార్టీ బలపడదన్నారు. ‘చంద్రబాబును మేము భయపెట్టడం లేదు. అవినీతి పరులకు శిక్ష తప్పదని ప్రధాని మోదీ స్పష్టీకరణతో బాబు భుజాలు తడుముకుంటే ఏమి చేయలేము. పోలవరంలో దాదాపు రూ. 2200 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల సమితి నిర్ధారించింది. పోలవరం, అమరావతిలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలవరానికి కేంద్రం ఇచ్చిన డబ్బులకు చంద్రబాబు లెక్కలు చెప్పలేదు. అప్పు తీసుకున్న ధనాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద ఖర్చు చేశారు. సుజనా చౌదరి చంద్ర బాబు గురించి అమిత్ షా తో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మోదీని చంద్ర బాబు ఏ నాయకుడు తిట్టని విధంగా తిట్టారు. రుణాలు ఎగవేత విషయంలో ఎవరు తప్పించుకోలేరు. సుజనా చౌదరి కూడా బ్యాంక్ రుణాలు కట్టాల్సిందే. బీజేపీలో చేరినంత మాత్రాన ఎలాంటి మినహాయింపు ఉండద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos