నా కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణం

నా కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణం

హైదరాబాదు: తన కెరీర్ నాశనం కావడానికి షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణమని షటిల్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సోమవారం ఇక్కడ ఆరోపించారు.‘నేను ఎదుర్కొన్న వేధింపులకు ఆయనే కారణం. ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెప్పగలను. బ్యాడ్మింటన్ లో నా సత్తా ఏంటో ఆయనకు తెలుసు నాకు మద్దతుగా ఉంటాడని భావించా. అయితే నానతో కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆడేవాడు. ఒకప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదు. ఒక దశాబ్దంగా ఇక్కడి గోపీచంద్ అకాడమీ నుంచే వస్తున్నారు. గోపీచంద్ అకాడమీ వారికైతేనే గుర్తింపు వస్తుంది. మన దేశానికి పతకం వస్తే గోపీచంద్ వల్ల వచ్చినట్టు చెప్పుకుంటారు. రాకపోతే ఇతరుల మీదకు నెట్టేస్తార’ ని దుయ్యబట్టారు. గుత్తా జ్వాల, గోపీచంద్ ఇద్దరూ కలిసి మిక్స్ డ్ డబుల్స్ లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos