రాహుల్ పై ఆరోపణాస్త్రాలు

రాహుల్ పై ఆరోపణాస్త్రాలు

న్యూ ఢిల్లీ : “ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది” అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీ అధినేత సోనియాకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ‘ రాహుల్గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్కు కష్టాలు ఆరంభమయి. తను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైంది. అనుభవజ్ఞులైన నేతలను రాహుల్ పక్కకు పెట్టారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారు. పార్టీలో సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారు. 2019 ఎన్నికల నాటి నుంచి పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది. యూపీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని దెబ్బతీసిన రిమోట్ కంట్రోల్ విధాన్నానే ఇప్పటికీ కాంగ్రెస్లో అమలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన చాలా విషయాల్లో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమే. కీలక నిర్ణయాలు రాహుల్ గాంధీ లేదా ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకొంటున్నారు.అధినాయకత్వం అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. తాజాగా నిర్వహిస్తోన్న పార్టీ ఎన్నికలు కూడా ఓ బూటకం. ఏఐసీసీ కోటరీ ముందుగానే సిద్ధం చేసిన జాబితాపై సంతకాలు చేయిస్తారు. అసలు ఇప్పటి వరకు బూత్, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎలక్టోరల్ రోల్ను పబ్లిష్ చేయలేదు. పార్టీలో జరుగుతున్న భారీ మోసానికి ఏఐసీసీ నాయకత్వమే బాధ్యత వహించాలి. భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఈ పరిస్థితి తగునా అనే విష యంపై అధినాయకత్వం తమ అంతరాత్మను ప్రశ్నించు కో వాల’ని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos