బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు.

గాంధీనగర్ : మెహ్సనా జిల్లా విజపూర్ ఎమ్మెల్యే మాజీ హోం శాఖ మంత్రి నరేష్ రావల్, రాజ్యసభ మాజీ సభ్యుడు రాజు పర్మర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయ నున్నట్లు బుధవారం ఇక్కడ ప్రకటించారు. ‘పార్టీతో అనేక విషయాల్లో నాకు అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఆ అంశాలు ఇప్పుడు ప్రస్తావించాలనుకోవడం లేదు. పార్టీకి జైహింద్ చెప్పాలనుకుంటున్నా. త్వరలోనే బీజేపీలో చేరుతా. ఆ పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా పనిచేయడానికి సిద్ధమేన’ని నరేశ్ రావల్ చెప్పారు. ‘కాంగ్రె స్ పార్టీతో తనకు 35 ఏళ్లుగా అనుబంధం ఉంది. పార్టీపై ఎలాంటి ఫిర్యాదులు చేయదలచుకోలేదు. పార్టీ నాయకత్వం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టింది. పార్టీ నుంచి ఎలాంటి పదవులు, ఫేవర్స్ ఆశించనప్పటికీ పార్టీకి సేవలందించే అవకాశం నాకు ఇవ్వకపోవడం దురదృష్టకరం. మరిందరు సీనియర్ నేతలు కూడా త్వరలో పార్టీని వీడనున్న’ట్టు రాజు పర్మర్ చెప్పారు. నరేష్ రావల్, రాజు పర్మర్ రాజీనామా ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా విలేఖరులతో మాట్లాడారు. ‘ఇద్దరు నేతలకు పార్టీ చాలనే అవకాశాలు ఇచ్చింది. నరేష్ రావల్కు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చింది. కొద్దికాలం అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేశారు. ఐదుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టగా మూడుసార్లు ఆయన గెలిచారు. రాజు పర్మర్ను సైతం పార్టీ మూడుసార్లు రాజ్యసభకు పంపింది. షెడ్యూల్డ్ కులాల కమిషన్కు చైర్మన్ను చేసిం ది. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పార్టీతో మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఇలా పార్టీని వీడటం వల్ల పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపడంతో పాటు పార్టీ వ్యతిరేక ఆలోచనకు తావి స్తుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos