చౌక డిపోల్లో మేలి రకం బియ్యం

చౌక డిపోల్లో మేలి రకం బియ్యం

శ్రీ కాకుళం: చౌక ధరల దుకాణాల్లో ‘స్వర్ణ’ రకం వంటి మేలి రకం బియ్యాన్ని వితరణ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోన రెడ్డి ప్రకటించారు. శుక్ర వారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ ప్రస్తుతం ప్రజలు తీసుకుంటున్న బియ్యాన్ని యాన్ని రూపాయి, రెండు రూపా యలకు తిరిగి విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని మారుస్తాం. ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వారి నుంచే కొనుగోలు చేస్తున్న డీలర్లు, తిరిగి దాన్నే ప్రభు త్వానికి అమ్ముతున్నారు. ప్రభుత్వం మళ్లీ ఆ బియ్యాన్నే ప్రజలకు అందిస్తోందని, ఇకపై ఇలా జరగదు. ప్రజలకు ‘స్వర్ణ’ రకం వంటి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామ’ని వివరించారు. ‘శ్రీకాకుళం జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మేలి రకం బియ్యం వితరణ ప్రారంభిస్తాం. ఆరు నెలల పరిశీలన అనం తరం ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. ప్రతి పేద ఆకలీ తీరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం. నాణ్యత పెంచి బియ్యాన్ని ప్రతి ఒక్కరికీ ఇస్తాం. ఇందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయ’ని విశదీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos