జీర్ణశక్తికి మేక పాలు

జీర్ణశక్తికి మేక పాలు

హైదరాబాద్ : జీర్ణశక్తికి మేక పాలు ఎంతో శ్రేష్ఠమైనవని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ పాలలో ఆవు పాలతో సమానమైన కొవ్వు పదార్థం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆవు, బర్రె పాలతో పోల్చితే తక్కువ ధర ఉండే మేక పాలు త్వరగా జీర్ణం అవుతాయని, పొట్టలో గ్యాస్, ఉబ్బర సమస్యలు రావని చెప్తున్నారు. ‘మేక పాలు కడుపులోకి వెళ్లిన తర్వాత పెరుగుగా మారుతుంది. ఇది ఆవు పెరుగు కంటే మెత్తగా ఉంటుంది. ఆవు పాలలో 10 శాతం పెరుగు ఉంటే, మేక పాలలో 2 శాతం మాత్రమే ఉంటుంది. ఇది శరీర జీర్ణక్రియకు సహాయపడుతుంది’ అని వివరించారు. ప్రస్తుతం ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో మేకపాలతో చేసిన ఉత్పత్తులను అధికంగా వినియోగిస్తున్నారు.
మేక పాలలో ఆరోగ్య గుణాలు
మేకపాలలో ఫ్యాటీ యాసిడ్స్, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి. వీటిలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక కప్పు మేక పాలలో ఆవు పాల కంటే 12 శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది. లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు మేకపాలు తాగొచ్చు.
ఈ పాలలో ప్రీబయాటిక్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగదలకు తోడ్పడుతాయి.
మేక పాలలో విటమిన్-ఏ, బీ కాంప్లెక్స్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos