సూర్యునిపై అత్యంత భారీ విస్ఫోటనం

సూర్యునిపై అత్యంత భారీ విస్ఫోటనం

న్యూ ఢిల్లీ : సూర్యుని తూర్పు భాగంలో అత్యంత భారీ విస్ఫోటనం సంభవించింది. దీని నుంచి వెలువడుతున్న ప్లాస్మా భూమి నుంచి చంద్రుని వరకు విస్తరించనుంది. దీనిని వర్ణించడానికి శాస్త్రవేత్తలకు మాటలు తోచటం లేదు. దీనిని గినార్మస్ ఇరప్షన్ అంటున్నారు. దీని ప్రభావం భూమిపై ఉండబోదని అంచనా. సాధారణంగా పదార్థాలను ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చెబుతారు. వీటి తర్వాత నాలుగో స్థితి ప్లాస్మా. దీనిలో అత్యంత తీవ్రమైన వేడి కలిగిన వాయువు ఉంటుంది. దీనిలోని అణువులు ఎలక్ట్రాన్లు, అయాన్లుగా విడిపోతాయి. ఇవి దేనికదే స్వతంత్రంగా కదులుతాయి. కెంటకీ, నికొలస్విల్లేలోని ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ ఎన్ ష్రాంట్జ్ సూర్యునిపై భారీ విస్ఫోటనాన్ని గుర్తించారు. ఇది విపరీతమైన తీవ్రతగలదని గమనించారు. దీనిని గినార్మస్ అని పేర్కొన్నారు. ఇది అంతరిక్షంలో 3,25,000 కిమీ దూరం విస్తరించినట్లు తెలిపారు. సౌర కదలికలను, సోలార్ సైకిల్ను పరిశీలించే స్పేస్వెదర్.కామ్ ఈ గినార్మస్ చిత్రాలను విడుదల చేసింది. దీని కుడి భాగం చాలా అస్థిరంగా ఉందని, ఇది ఏ క్షణంలోనైనా కుప్ప కూలవ చ్చు నని తెలిపింది. ఇది సూర్యునికి వేరొక వైపున ఉండటం వల్ల దీని ప్రభావం భూమిపై ఉండబోదని పేర్కొంది. కాంతి నేరుగా పడే వైపున ఇది లేనందువల్ల టెలిస్కోపుల ద్వారా ఈ ప్లాస్మాను చూడవచ్చు. సన్స్పాట్ ఏఆర్3068 వేగంగా పెరుగుతోంది. బీటా-గామా అయస్కాంత క్షేత్రం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దీనివల్ల మధ్యతరహా జ్వాలలు రేగుతాయి. భూమిపైగల ధ్రువ ప్రాంతాలపై ప్రభావం చూపగలిగే స్వల్ప రేడియో బ్లాక్అవుట్స్ ఏర్పడతాయి. సన్స్పాట్ నేరుగా భూమికి ఎదురుగా ఉందని, అందువల్ల పేలుళ్ళు జరిగితే భూమిపై ప్రభావం చూపుతాయని స్పేస్వెదర్ చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos