వైభవంగా గౌరీ పూజలు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని అగ్గొండపల్లిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గౌరీ పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఏటా కార్తీక మాసంలో గౌరీ పూజలను నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా కార్తీక మాసం మొదటి రోజు నుంచి 15 రోజుల పాటు మంగళ గౌరీని ప్రతిష్ఠించి మహిళలు రోజూ పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు మంగళ వాయిద్యాలతో గ్రామంలో అఖండ దీపాన్ని వీధులలో ఊరేగిస్తారు. ఇంటింటా అమ్మవారికి పసుపు కుంకుమ సేకరించి గౌరమ్మకు సమర్పిస్తారు. తరువాత మహిళలు గౌరమ్మకు పసుపు, కుంకుమ పెట్టి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి దీపారాధన నిర్వహించారు. తరువాత గౌరమ్మకు కర్పూర హారతులు ఇచ్చారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో మహిళలు గౌరమ్మకు దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు

తాజా సమాచారం