పరప్పన అగ్రహార చెరసాల నుంచి జూదం నిర్వహణ

పరప్పన అగ్రహార చెరసాల నుంచి జూదం నిర్వహణ

ప్రజావాహిని-బెంగళూరు

పరప్పన అగ్రహార చెరసాల ఖైదీల్లోని గూండాలు తమ అనుచరుల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జూదాలు నిర్వహణ, బలవంతపు వసూళ్లు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మద్దూరు సభ్యుడు డి.సి.తమ్మణ్ణ మంగళవారం విధానసభలో ఆరోపించారు. ప్రశ్నోత్తర వేళలో కుణిగల్‌ నియోజక వర్గంలో అక్రమ జూదశాల గురించి ఆ సభ్యుడు డాక్టర్‌  రంగనాథ్‌ చేసిన ప్రస్తావించారు. ఈ సందర్భంగా తమ్మణ్న జోక్యం చేసుకున్నారు. రోజుకో తోటలో, పొలాల్లో వంతున జూదశాలల్ని మార్చి పోలీసులకు దొరక్కుండా  తప్పించుకుంటున్నారని వివరించారు. జూదరుల్ని పరివర్తన చేసేందుకు చర్యలు తీసుకోవాలని రంగనాథ్‌ కోరారు. జూదం లేని రాష్ట్రంగా కర్నాటకను మలిచేందుకు కట్టుదిట్టమైన చట్టాన్ని చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజబొమ్మై, హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర భరోసా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos