స్టాక్‌ మార్కెట్లకు దండిగా లాభాలు

స్టాక్‌ మార్కెట్లకు దండిగా లాభాలు

ముంబై: కొనుగోళ్ల అండతో బుధ వారం ఉదయం రంకె లేసిన బుల్ సాయంత్రానికి చల్లబడింది. అయినా లాభాలు మిగిలాయి. ట్రేడింగ్లో సరి కొత్త రికార్డులను తాకిన సూచీలు ఆ తర్వాత లాభాల స్వీకరణతో దిగాయి. ఉదయం 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 40,816 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 12వేల మార్క్ పైన కదలాడింది. చివర్లో కొన్ని రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కిందకు దిగాయి. సెన్సెక్స్ 181.94 పాయింట్లు లాభపడి 40,651.64 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 11,999.10 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.83గా దాకలైంది. ఎన్ఎస్ఈలో జీ ఎంటర్టైన్మెంట్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ పెట్రోలియం, రెడ్డీస్  ల్యాబ్స్ లాభాల్ని గడించాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, కొటక్ మహింద్రా బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos