అవి ఎలుగుబంటి పాద ముద్రలు

అవి ఎలుగుబంటి పాద ముద్రలు

నేపాల్: హిమాలయాల్లో మకలు స్థావరం వద్ద యతి పాద ముద్రల్ని కనుగొన్నామని భారత పదాతి దళ అధికారులు చేసిన ప్రకటనలో ఆవగింజత నిజంలేదని నేపాల్ పదాతి దళ అధికారులు తేల్చి చెప్పారు. ఆ పాద ముద్రలు ఎలుగు బంటివని వారు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఎలుగు బంటి పాద ముద్రలు తరచూ కనిపిస్తాయని వివరించారు. నేపాల్‌ లోని మకలు పర్వాతారోహణకు వెళ్లిన భారత పదాతి దళ మేజర్ మనోజ్ నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందం ఏప్రిల్ 2న యతి (మంచు మనిషి) పాద ముద్రలు కనిపించినట్లు ట్వీట్‌ చేసింది. పాదం 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న పాద ముద్రల ఫొటోను ఏప్రిల్ 9న పోస్ట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos