జిల్లాకో ఫోక్సో న్యాయస్థానం

జిల్లాకో ఫోక్సో న్యాయస్థానం

న్యూఢిల్లీ : చిన్నారుల పై లైంగిక దాడుల కేసుల సత్వర విచారణకు పోక్సో చట్టం కింద ప్రత్యేక న్యాయ స్థానాల్ని రెండు మాసాల వ్యవధిలో ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయ స్ధానం గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూటి కంటే ఎక్కువ వ్యాజ్యాలు పరిష్కారం కాని ప్రతి జిల్లాలో వీటిని ఏర్పాటు చేయాలని, ఇందుకు తగినన్ని నిధులను కేటాయించాలని కేంద్రాన్ని సూచించింది.తదుపరి విచారణను సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది. చిన్నారులపై లైంగిక దాడికి సంబంధించి దాదాపు 1.5 లక్షలకు పైగా కేసుల విచారణకు ప్రస్తుతం కేవలం 670 పోక్సో న్యాయస్థానాలు ఉన్నాయని అమికస్ క్యూరీ గిరి, సుప్రీం కోర్టు రిజిస్ర్టీ సమర్పించిన నివేదికల ప్రాతిపదికన ఈ ఆదేశాల్ని జారీ చేసింది. ప్రస్తుతం ఒక న్యాయమూర్తి రోజుకు సగటున 224 కేసులను పర్యవేక్షిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఏడాదిలోపు పోక్సో కేసులు పరిష్కారం కావాలంటే ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న సిబ్బందికి మూడు రెట్లు అదనపు సిబ్బంది అవసరమని తెలిపింది. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్షను ఖరారు చేస్తూ రాజ్యసభ బుధవారం పోక్సో చట్ట సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos