ఉత్తరాదిలో వర్షాలు.. కేరళలో వరదలు

న్యూఢిల్లీ : ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ ఎడ తెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. ఉత్తరాఖండ్ను వర్షాలు వణికిస్తున్నాయి. పౌరీ జిల్లాలోని లాన్స్డౌన్ సమీపంలోని సమ్ఖాల్లో వర్షం ధాటికి రాళ్లు జారిపడడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. వారు నివసిస్తున్న గుడారంపై రాళ్లు జారిపడ్డాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వర్షాలు తగ్గి, పరిస్థితి చక్కబడేదాకా ముందుకెళ్లకూడదని చార్ధామ్ యాత్రికులకు అధికారులు సూచించారు. చార్ధామ్ ఆలయాలకు జనాన్ని తీసుకెళ్లే వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేసారు. భక్తులు సురక్షితమైన ప్రాంతాల్లోనే బస చేయాలని చెప్పారు. కేరళలో వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం స్తంభించి పోతోంది. వీడని జడివాన కారణంగా శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్ తెలిపారు. భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పించే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. రాష్ట్రంలో నిండుకుండల్లా మారిన 10 డ్యామ్లకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పంపా నదిలో నీటి మట్టం పెరుగు తున్నం దునయాత్రను నిలిపివేశామన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబర్ నెల 1960 నుంచి అత్యధిక వర్షాలు కురిసిన అక్టోబర్గా రికార్డుకెక్కింది. నగరంలో 1960 అక్టోబర్లో 93.4 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది. ఈసారి ఇదే నెలలో ఇప్పటిదాకా 94.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదయ్యింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos