మేలూరులో ఈగల బెడద

మేలూరులో ఈగల బెడద

హోసూరు : ఇక్కడికి సమీపంలోని మేలూరులో ఈగల బెడద నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా డెంక ణీకోట సమీపంలోని మేలూరు గ్రామం వద్ద కోళ్ల ఫామ్ లను నిర్వహిస్తున్నారు.  గ్రామానికి అతి చేరువలో కోళ్ల ఫామ్ ఉన్నందున  గ్రామంలో ఈగల బెడద ఎక్కువ అయింది. కోళ్ల ఫారంలలో అశుభ్రత వల్ల  ఈగల బెడద ఎక్కువైందని గ్రామస్థులు వాపోతున్నారు.  కోళ్ల ఫామ్ వద్ద మందులు పిచికారి చేయాలని గ్రామస్తులు యాజమాన్యా లను కోరినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.   అన్నం తినడానికి కూడా ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈగల బెడద వల్ల చిన్న పిల్లలకు జ్వరం వస్తున్నందున అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో ఈగల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos