ఎన్ఆర్సీ ఎఫెక్ట్..స్వదేశాలకు విదేశీయులు..

ఎన్ఆర్సీ ఎఫెక్ట్..స్వదేశాలకు విదేశీయులు..

భారతీయ పౌరసత్వ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ)తో దేశంలోని పలు ప్రధాన నగరాలు,పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు సొంతదేశాలకు తిరుగుముఖం పడుతున్నారు.దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామంటూ హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించడంతో విదేశీయులు తమ దేశాలకు తిరుగుప్రయాణమవుతున్నారు. సొంతదేశాలకు వెళుతున్న ప్రజల సంఖ్యలో బంగ్లాదేశీయులే ఎక్కువగా ఉన్నారు.ఎన్‌ఆర్‌సీ ప్రకటనతో బెదిరిపోయిన బంగ్లాదేశీయులు తమ దేశానికి వెళుతూ హౌరా రైల్వేస్టషన్‌లో పోలీసులకు చిక్కారు.200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఇక్కడుంటే తమకు వేధింపులు ఎక్కవవుతున్నాయని.. ప్రతీ ఒక్కరూ బెదిరిస్తున్నారని వారిలో కొందరు పోలీసులకు తెలిపారు. వేధింపుల పర్వం బెంగళూరులో ఎక్కువ ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్న సంఖ్య బెంగళూరులోనే ఉండడంతో అక్కడి పోలీసులు అక్రమ వలసదారుల కోసం గాలింపు విస్తృతం చేశారు.నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు వెళ్లిపోవాలంటూ బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్ రావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.విదేశీయులకు ఆశ్రయం కల్పించి, ఉద్యోగం కల్పించడం నేరమని వారికి ఉపాధి కల్పిస్తున్న యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.విదేశయులు తమ దేశాలకు వెళ్లడానికి ప్రయాణ భత్యం కూడా అందజేస్తున్నట్టు తెలిపారు.ఇండియాలో ఎన్ఆర్సీ, బెదిరింపులతో చాలామంది తిరిగి బంగ్లాదేశ్ వస్తున్నారని అక్కడి మీడియా తెలిపింది.వలస వస్తున్న వారిలో బెంగళూరు నుంచే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది.కాగా ఎన్‌ఆర్‌సీ ప్రకటనతో బెదిరింపులు ఎక్కువ కావడంతో స్వదేశానికి వెళ్లిపోతున్నామని కానీ సరిహద్దుల్లో అరెస్ట్‌ చేస్తుండడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామంటూ విదేశీయులు వాపోతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos