లాభాల జోరుకు కళ్లెం

లాభాల జోరుకు కళ్లెం

ముంబై: మంచి ఊపు మీద సోమవారం ఆరంభమైన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నానికి చతికిల పడి కడకు ఎదుకూ బొదుగూ లేకుండా ముగిసాయి. ఎక్కువ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ తీవ్ర ఒడిదొడుకులకు గురై స్వల్ప లాభాలతో వ్యాపారాన్ని ముగించింది. వాహన విక్రయాల తగ్గు ముఖం విపణిని ప్రభావితం చేసింది. కాల్, డేటా ఛార్జీలను పెంచనున్న సంస్థల షేర్లు పుంజకున్నాయి. 169 పాయింట్ల లాభంతో 40,963 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం కల్లా నష్టాల బాట పట్టింది. చివరి గంటలో కొద్దిగా పుంజుకున్నా తొలి వైభవాన్ని సంతరించుకోలేక పోయింది. సెన్సెక్స్ 8.36పాయింట్లు లాభపడి 40,802.17 వద్ద, నిఫ్టీ 7.80 పాయింట్లు నష్టపోయి 12,048.20 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.68 వద్ద దాఖలైంది. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాల్ని గడించాయి. యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రా టెల్, ఓఎన్జీసీ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos