ఈ ప్రశ్నలకు బదులేది?

ఈ ప్రశ్నలకు బదులేది?

కాన్పూర్: గూండా వికాస్ దూబే హతంపై అనే అనుమానాలు తలెత్తాయి. ‘వికాస్ దూబేను తీసుకొస్తుండగా కాన్పూర్కు కచ్చితంగా 30 కిలోమీటర్ల దూరంలో కారు బోల్తాపడగా..వికాస్ దూబే పోలీసుల పిస్టల్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. తిరిగి పోలీసులు కాల్పులు జరపగా చనిపోయాబ’నేది పోలీసుల కథనం. నిజంగా ఇది జరిగిందా లేక పోలీసులే అతన్ని చంపేసి కథనాన్ని సృష్టించారా అనే అనుమానాలు కదులుతున్నాయి. దీనిపై ఐదు ప్రముఖ ప్రశ్నలు తలెత్తాయి. అవి..1) వికాస్ దూబేను ఒక కారు నుంచి బోల్తాపడిన కారులోకి ఎందుకు మార్చారు? కాల్పులకు ముందు టోల్ప్లాజా వద్ద ఉన్న వీడియోలో తెల్లవారు జాము నాలుగు గంటలకు వికాస్ దూబే మరోకారులో ఉన్నట్లు స్పష్టంగా కనపడింది. 2) పోలీస్ వాహనాల్ని కాన్వారును అనుసరిస్తున్న మాధ్యమ వాహనాల్ని ఎందుకు ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశానికి రెండు కి.మీల ముందు ఆపేశారు?3) ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం వారికి తుపాకి పేలుళ్ల శబ్ధం వినిపించిందే తప్ప కార్ బోల్తాపడినట్లు గమనించ లేదు. తమను పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపొమ్మనట్లు చెప్పారు. 4)హత్యా నేరంతోపాటు 60 కేసుల్లో నిందితుడైన ప్రమాదకర నేరగాడు వికాస్దూబేను తీసుకొస్తున్నపుపడు అతని చేతులకు ఎందుకు సంకెళ్లు వేయలేదు?5) హైవేకు సైడ్ రైలింగ్ కూడా లేని చిన్న దారి లోనే కచ్చితంగా కారు ఎలా బోల్తా కొట్టింది?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos