పుల్వామా జిల్లాలో ఐదుగురి మృతి

పుల్వామా జిల్లాలో ఐదుగురి మృతి

పుల్వామా : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పింగ్లాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, జైషే మహ్మద్ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్ని  డి.ఎస్‌.డోండియాల్‌(మేజర్‌), సేవా రామ్‌(హెడ్‌ కానిస్టేబుల్), అజేయ్‌ కుమార్‌ (జవాను),హరిసింగ్‌(జవాన్‌)గా గుర్తించారు. ముస్తాక్‌ అహ్మద్‌ అనే పౌరుడు కూడా మృతి చెందాడు. గుల్జార్‌ అహ్మద్‌ అనే మరో జవాను గాయపడ్డారు. పింగ్లాల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జైషే మహ్మద్ తీవ్రవాదులు దాక్కున్నారనే సమాచారం  అందటంతో సోమవారం ఉదయం 55 రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లు దాడికి దిగారు. ఈ దశలొ  తీవ్రవాదులు –జవాన్లు మధ్యకాల్పులు జరిగాయి. ఫలితంగా  ఓ ఆర్మీ మేజర్ , ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ఆర్మీ జవాన కు తీవ్ర గాయాల య్యాయి. ఉగ్రవాదుల దొంగ దెబ్బకు 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు బలికాగా  భద్రతా దళాలు ఆగ్రహంతో గాలింపుల్ని  చేపట్టాయి. ఈ సారి ఏకంగా ఉగ్రవాదలు  ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకెళ్లాయి. లెతోపోరా దాడికి కారకులైన కొందరు ఉగ్రవాదులు ఇంకా అదే ప్రాంతాలో ఉన్నారని అనుమానించిన దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. కొందరు ఉగ్రవాదులను లొంగి పొమ్మని హెచ్చరికలు జారీ చేశాయి. ముష్కరులు సానుకూలంగా స్పందించకుండా  దళాలపైకి హఠాత్తుగా కాల్పులు ప్రారంభించారు.

హతమైంది సూత్త్రధారా?

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టు బెట్టాయి.  పింగ్లాన్‌ వద్ద జరుగుతున్నగాలింపుల్లో  ఎదురు పడటంతో వారిని మట్టుబెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos