ఓలాకు జరిమానా

ఓలాకు జరిమానా

సేవాలోపంతో ఓలా క్యాబ్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మేనేజ్‌మెంట్ తో పాటు క్యాబ్ డ్రైవర్ తీరును వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ 2017లో ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష రాయడానికి నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఓలా క్యాబ్ (ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ) ను బుక్ చేశారు. సదరు సంస్థ బుకింగ్ ను స్వీకరిస్తూ క్యాబ్, డ్రైవర్ వివరాలతో ఆయన ఫోన్ నెంబర్ కు మేసేజ్ పంపింది. దాంతో క్యాబ్ కోసం వెయిట్ చేసిన శ్రీధర్ కు నిరాశే మిగిలింది. ఫోన్ చేస్తే దారిలో ఉన్నానంటూ చెబుతూ వచ్చాడు డ్రైవర్. పలుమార్లు ఫోన్ చేసినా అదే సమాధానం. చివరకు ఆ బుకింగ్ క్యాన్సిల్ చేసినట్లు మేసేజ్ వచ్చింది. దీంతో సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్లలేక ఎగ్జామ్ రాయలేకపోయారు శ్రీధర్.క్యాబ్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా తాను పరీక్ష రాయలేకపోయానని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు శ్రీధర్. బెంగళూరులోని ఓలా సంస్థతో పాటు కూకట్ పల్లిలోని బ్రాంచ్ నిర్వాహకులు, డ్రైవర్ సుధీర్ ను ప్రతివాదులుగా చేర్చుతూ కేసు ఫైల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఫోరం.. ఓలా క్యాబ్ సంస్థ తీరును తప్పు పట్టింది. వినియోగదారుడికి సేవలందించడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొంది. ఫిర్యాదుదారుడు శ్రీధర్ కు 10వేల రూపాయల పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో 2వేల రూపాయలు నెలలోగా చెల్లించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos